24న జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:14 AM
జిల్లా కేంద్రంలో స్థానిక విజ్జీ క్రీడా మైదా నంలో ఈనెల 24 నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాభి వృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయనగరం టౌన్, మార్చి 20(ఆంధ్రజ్యో తి): జిల్లా కేంద్రంలో స్థానిక విజ్జీ క్రీడా మైదా నంలో ఈనెల 24 నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాభి వృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 35 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు 100, 400, 800, 1500 మీటర్ల పరుగు పందెంలోనూ, అలాగే లాంగ్ జంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో వంటి క్రీడలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ క్రీడల్లో పాల్గొన దలచిన వారు తప్పనిసరిగా రాష్ట్ర క్రీడా ప్రాధి కార సంస్థ వెబ్‌సైట్‌లో తమ ఆధార్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపా రు. ఇతర వివరాలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయం సిబ్బందిని సంప్రదించగల రని చెప్పారు.