Share News

అమరావతి చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:21 AM

అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు.

అమరావతి చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలి

  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

విజయనగరం టౌన్‌, జూలై 13(ఆంధ్రజ్యోతి): అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు. సోమవారం ఆయన విజయనగరంలోని తన కార్యాలయంలో క్రీడా సమరోత్సవాల కరపత్రాలను జిల్లా క్రీడాధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి29 వరకూ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ పోటీల్లో ఆసక్తి ఉన్న అండర్‌-17, అండర్‌-19 విభా గాలకు చెందిన బాలురు, బాలికలకు 12 క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కల్పి స్తోందన్నారు. నియోజకవర్గ స్థాయిలో జూలై 15 నుంచి 25 వరకూ, జిల్లా స్థాయిలో 26 నుంచి ఆగస్టు 10 వర కూ, రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 20 నుంచి 26 వరకూ ఈ పోటీలు నిర్వహిస్తారని ఆయన వివరించారు. ఇతర వివరాలకు జిల్లా క్రీడాప్రాధికార అధికారి 6305536629 నెంబరును సంప్రదించగలరని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఏఏంసీ చైర్మన్‌ పీవీవీ గోపాలరాజు, బుజ్జీ, బాక్సింగ్‌ కోచ్‌ ఈశ్వరరావు, రూప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:21 AM