సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:56 PM
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎస్.కోట నియోజకవర్గంలోని 25 మందికి మంజూరైన రూ.16.54లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే లలితకుమారి ఆదివారం ఎల్.కోటలోని తన నివాసం వద్ద పంపిణీ చేశారు.
లక్కవరపుకోట, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎస్.కోట నియోజకవర్గంలోని 25 మందికి మంజూరైన రూ.16.54లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే లలితకుమారి ఆదివారం ఎల్.కోటలోని తన నివాసం వద్ద పంపిణీ చేశారు. ఈసందర్భం గా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.3.9కోట్లను పేదలకు అందించింద న్నారు. మావిగన్ అంటే ఏమిటని రాష్ట్ర ప్రజ లు జగన్మోహన్‌రెడ్డిని అడుగుతున్నారని.. మా మిడి పంట సస్యరక్షణకు వాడే పురుగు మం దు పేరేమోనని అనుకుంటున్నారని చమత్కిం చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, పీఏసీఎస్ అధ్య క్షుడు జీఎస్ నాయుడు, టీడీపీ కొత్తవలస మండల అధ్యక్షుడు కోల్ల శ్రీను, గొంప దుర్గాఉ మేష్, నక్కరాజు, చినరాము పాల్గొన్నారు.