సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:14 AM
నియోజకవర్గ పరిధిలో 8 మందికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.3,19,641 మంజూరయ్యాయి.
బొబ్బిలి, జనవరి14 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పరిధిలో 8 మందికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.3,19,641 మంజూరయ్యాయి. బుధవారం సంబంధిత చెక్కులను లబ్ధిదారులకు స్థానిక కోటలో ఎమ్మెల్యే బేబీనాయన పంపిణీ చేశారు. గునుపూరు ఆదినారాయణకు రూ.63,893, కె.సత్యనారాయణకు రూ.52,522, హైందవికి రూ.45 వేలు, కలిశెట్టి సోహన్ సాయికి రూ.37,378, సిరిపురం శృతికి రూ.36,480, పెద్దింటి సత్యంనాయుడుకు రూ.27,535, ఆల్తి అరుణజ్యోతికి రూ.25 వేలు చెక్కులను ఆయన అందజేశారు. కార్యక్రమం లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, ఐదో వార్డు కౌన్సిలర్ వెలగాడ హైమవతి, పాతబొబ్బిలి, మెట్టవలస గ్రామపెద్దలు పాల్గొన్నారు.