Share News

వివాహం కాలేదన్న మనస్తాపంతో..

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:25 AM

వివాహం కాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడు.

 వివాహం కాలేదన్న మనస్తాపంతో..

  • గడ్డి నివారణ మందు తాగి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి

సంతకవిటి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): వివాహం కాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని మండవకురిటి గ్రామానికి చెందిన శాసుబిల్లి శ్రీను(35) అనే యువకుడికి ఐదుగురు అక్కలు, ఒక చెల్లి ఉండగా.. వారందరికీ ఇప్పటికే వివాహాలు జరిగి తమ కుటుంబాలతో జీవిస్తున్నారు. తనకు మాత్రం వివాహం జరగకపోవడంతో శ్రీను గత కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్నాడు. అలాగే తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో శ్రీను ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఇదే తరుణంలో ఇటీవల మేనల్లుడి వివాహం కూడా నిశ్చయం కావడంతో శ్రీను మరింత ఆవేదనకు గుర య్యాడు. దీంతో ఈనెల 24న రాత్రి గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యా యాత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే రాజాం ఆస్పత్రికి తరలిం చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీను సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనపై శ్రీను మేనల్లుడు తూము సతీష్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాదరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 01 , 2026 | 12:25 AM