ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో..
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:38 AM
ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందా డు.
యువకుడి ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి
కొత్తవలస, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందా డు. ఈ ఘటనపై సీఐ టీవీ విజయ్‌కుమార్ శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేశపాత్రుపాలెం సమీపంలో బంగారమ్మ గుడి వద్ద నివాసం ఉంటున్న మండవ కామేశ్వరరావు కుమారుడు మండవ శివప్రసాద్(21) ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో గురువారం పురుగు మందు తాగి ఆత్యహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన తండ్రి కామేశ్వవరావు విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శివప్రసాద్ గురువారం రాత్రి మృతిచెందాడు. తండ్రి కామేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.