విద్యార్థి అదృశ్యం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:17 AM
విజయనగరం మండలం బియ్యా లపేట గ్రామానికి చెందిన పాలిటెక్నికల్ విద్యార్థి నారంశెట్టి గణపతి(17) అదృశ్య మయ్యాడు.
విజయనగరం కైం, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): విజయనగరం మండలం బియ్యా లపేట గ్రామానికి చెందిన పాలిటెక్నికల్ విద్యార్థి నారంశెట్టి గణపతి(17) అదృశ్య మయ్యాడు. విజయనగరం రూరల్ ఎస్‌ఐ అశోక్ అందించిన వివరాల ప్రకారం.. గణపతి కొన్ని రోజులుగా కళాశాలకు వెళ్లడం లేదని తండ్రి రమణ మందలిం చారు. మనస్తాపానికి గురైన గణపతి ఈనెల 2న ఇంటి నుంచి వెళ్లిపోయాడు కు టుంబసభ్యులు బంధువులు, స్నేహితులను వాకబు చేశారు. ఫలితం లేకపో వడంతో తండ్రి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.