Direct flight to Delhi ఢిల్లీకి నేరుగా విమానం
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:45 AM
Direct flight to Delhi భోగాపురం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ సంస్థ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు.
ఢిల్లీకి నేరుగా విమానం
భోగాపురం నుంచి మరిన్ని సర్వీసులు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయనగరం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి)
భోగాపురం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ సంస్థ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను కొత్త విమాన సర్వీసు ఆందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. అక్టోబరు 25వ తేదీ నుంచి ఈ సర్వీసు ప్రారంభం కానుందని, ఉదయం 5.55కు ఢిల్లీలో ప్రారంభమై 8.20కి భోగాపురం చేరుకోనుందని తెలిపారు. మళ్లీ భోగాపురంలో 9.05 నిమిషాలకు ప్రారంభమై 11.30కు ఢిల్లీ చేరుకుంటుందన్నారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా దేశంలోని ప్రధాన నగరాలకు కనెక్టవిటీ మరింత విస్తరించడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విమానయాన రంగం, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. మూడు సంవత్సరాల విఽరామం తర్వాత ఆకాశ ఎయిర్ తిరిగి విశాఖపట్నం ప్రాంతంలో తన విమాన సేవలను ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులు, గమ్యస్థానాల సంఖ్యను మరింత పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
=============