డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:07 AM
ఓటరు నమోదు ప్రక్రియలో సేకరించిన ఎన్యు మరేషన్ ఫారాల డిజిటలైజే షన్‌ను వేగవంతం చేయా లని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రామసుందరరెడ్డి ఆదేశించారు.
- కలెక్టర్ రామసుందరరెడ్డి
విజయనగరం, జూన్ 26 (ఆం ధ్రజ్యోతి): ఓటరు నమోదు ప్రక్రియలో సేకరించిన ఎన్యు మరేషన్ ఫారాల డిజిటలైజే షన్‌ను వేగవంతం చేయా లని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రామసుందరరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్ట రేట్‌లో అధికారులతో నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాంపైన్ నిర్వ హిస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని పో లింగ్ కేంద్రాల పరిధిలోని బీఎల్వోలు అందు బాటులో ఉండి ఈ కార్యక్రమం చేపట్టాల న్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయాలన్నారు. ఒక్కఫారం కూడా పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, సహాయ నమోదు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అవసరమైన సాంకే తిక సహాయాన్ని అందించి గంట గంటకు పురోగతిపై సమీ క్షించి నివేదికను అందజేయా లని ఆదేశించారు. జిల్లాలోని ఓటర్లు తమ పోలింగ్ కేంద్రా లకు వెళ్లి అధికారులకు అవస రమైన సమాచారం అందిం చి సహకరించాలని కోరారు.
మొదటి స్థానంలో గజపతినగరం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం తుది దశకు చేరుకున్నట్లు డీఆర్వో సత్తిబాబు తెలిపారు. గురువారం నాటికి జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ 98.85 శాతం పూర్త యిందన్నారు. 99.97 శాతంతో గజపతినగరం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. తరువాత స్థానంలో చీపురుపల్లి, విజయనగ రం నిలిచాయన్నారు. ఫారాలు పంపిణీ వేగ వంతంగా సాగుతున్నప్పటికీ ఆన్‌లైన్ నమోదు పక్రియలో జిల్లా కొంత వెనుకబడి ఉందన్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఆర్వో తెలిపారు.