Digging up the tank... covering up the stream. చెరువు తవ్వేసి.. గెడ్డను కప్పేసి
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:13 AM
Digging up the tank... covering up the stream. కొత్తపేట గ్రామంలో ఓ వైసీపీ నేత బరితెగించారు. మొన్నటి వరకు ప్రజాప్రతినిధిగా వ్యవహరించి తాజాగా మాజీగా మారిన ఆయన అక్రమాల్లో మాత్రం జోరు తగ్గించలేదు. తన గ్రామ పరిధిలోని నెల్లిమర్ల-రణస్థలం రోడ్డుకు ఆనుకొని ఉన్న జగ్గారావు చెరువులో యంత్రాలు, ట్రాక్టర్లతో పట్టపగలే చెరువు మట్టిని లూటీ చేశారు. అదే తోవలో రెవెన్యూ అధికారులు పలు గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నా ఆక్రమంపై కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
చెరువు తవ్వేసి.. గెడ్డను కప్పేసి
కొత్తపేటలో బరితెగించిన వైసీపీ నేత
పట్టపగలు చెరువు మట్టి లూటీ
ఆ మట్టితో కొండవాగు గెడ్డ కప్పివేత
కళ్లప్పగించి చూస్తున్న అధికారులు
లబోదిబోమంటున్న రైతులు
నెల్లిమర్ల, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): కొత్తపేట గ్రామంలో ఓ వైసీపీ నేత బరితెగించారు. మొన్నటి వరకు ప్రజాప్రతినిధిగా వ్యవహరించి తాజాగా మాజీగా మారిన ఆయన అక్రమాల్లో మాత్రం జోరు తగ్గించలేదు. తన గ్రామ పరిధిలోని నెల్లిమర్ల-రణస్థలం రోడ్డుకు ఆనుకొని ఉన్న జగ్గారావు చెరువులో యంత్రాలు, ట్రాక్టర్లతో పట్టపగలే చెరువు మట్టిని లూటీ చేశారు. అదే తోవలో రెవెన్యూ అధికారులు పలు గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నా ఆక్రమంపై కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా అక్రమంగా తవ్విన ఆ మట్టితో మరో అక్రమానికి పాల్పడుతున్నారు. ఇదే గ్రామ పరిధిలోని తాను, అనుచరులు వేస్తున్న లేఅవుట్ కోసం ఏకంగా కొండవాగు గెడ్డను కప్పేస్తున్నారు. దశాబ్దాల కాలం నుంచి సుమారు రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించే సర్వేనెంబరు 164లోని కొండవాగు గెడ్డను కప్పేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టపగలు అక్రమంగా చెరువు మట్టిని తవ్వేసినా ఆయనకు ఎదురులేకపోవడంతో గెడ్డవాగు కప్పేందుకు సైతం వెనుకాడలేదు. సుమారు 30 అడుగలకుపైగా ఉన్న ఆ గెడ్డలో ఇప్పటికే దాదాపు పది అడుగులకు పైగా మట్టితో కప్పేశాడు. విషయం తెలిసిన రైతులు ఈ అక్రమంపై పరిశీలించి నిలదీయగా ఆ ప్రాంతంలో అసలు గెడ్డేలేదని బుకాయిస్తున్నట్టు సమాచారం. గెడ్డ అక్రమ కప్పివేతపై టీడీపీ నేత గురాన చక్రధర్‌తోపాటు పలువురు రైతులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ అధికారులు ఇంతవరకు పరిశీలనకు కూడా వెళ్లలేదు. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, చెరువు మట్టిని, కొండవాగు గెడ్డ వాస్తవ రూపాన్ని రక్షించాలని గ్రామ రైతులు కోరుతున్నారు.
అధికారులు స్పందించకపోతే ఉద్యమమే
గురాన చక్రధర్, టీడీపీ నేత
వైసీపీ నాయకుడు వ్యక్తిగత ప్రయోజనం కోసం చెరువు మట్టిని దొంగిలించి, అదే మట్టితో సాగునీటి గెడ్డను కప్పేయడం అత్యంత దారుణం. తక్షణమే ఈ అక్రమంపై రెవెన్యూ అధికారులు స్పందించాలి.
సర్వే చేయించి చర్యలు తీసుకుంటాం
కొత్తపేట చెరువులో మట్టి తవ్వకం, వైసీపీనేత గెడ్డవాగు కప్పేస్తున్న విషయమై తహసీల్దార్ శ్రీకాంత్‌ను వివరణ కోరగా సర్వే చేయించి గెడ్డవాగు ఆక్రమణకు గురైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.