Share News

Digging at night పగలు ఊరుకుని.. రాత్రి తవ్వుకుని

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:58 PM

Digging at night after staying idle during the day... చీపురుపల్లి సమీపంలోని కోడూరు కొండను గ్రావెల్‌ కోసం కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతున్నారు. పగటి పూట సైలెంట్‌గా ఉంటూ అధికారుల దృష్టి పడకుండా చూసుకుంటున్నారు. రాత్రి వేళల్లో ఎక్సకవేటర్లతో భారీగా తవ్వి తరలిస్తున్నారు. రామాంజనేయకాలనీ జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఈ తవ్వకాలు జరుగుతుండడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Digging at night  పగలు ఊరుకుని.. రాత్రి తవ్వుకుని
జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో కొండను భారీగా తవ్వేస్తున్న దృశ్యం

పగలు ఊరుకుని.. రాత్రి తవ్వుకుని

ఉన్నత పాఠశాల సమీపంలో గ్రావెల్‌ తవ్వకాలు

పిల్లలకు పొంచి ఉన్న అపాయం

ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులు

చీపురుపల్లి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి సమీపంలోని కోడూరు కొండను గ్రావెల్‌ కోసం కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతున్నారు. పగటి పూట సైలెంట్‌గా ఉంటూ అధికారుల దృష్టి పడకుండా చూసుకుంటున్నారు. రాత్రి వేళల్లో ఎక్సకవేటర్లతో భారీగా తవ్వి తరలిస్తున్నారు. రామాంజనేయకాలనీ జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఈ తవ్వకాలు జరుగుతుండడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైస్కూలు క్రీడా మైదానానికి ఆనుకొని తవ్వడం వల్ల ఆ ప్రదేశంలో గుంతలు ఏర్పడి, విద్యార్థులకు ప్రమాదం జరగవచ్చునని కలవరపడుతున్నారు. సమీకృత వసతిగృహానికి కూడా సమీపంలో ఉన్న ఈ కొండపై గ్రావెల్‌ తవ్వకాలు గత కొంత కాలంగా సాగుతున్నాయి. గుర్తు తెలియని కొంతమంది రాత్రి వేళల్లో భారీ ఎత్తున గ్రావెల్‌ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫిర్యాదులున్నప్పటికీ గ్రావెల్‌ తరలింపు రాత్రి వేళల్లో జరుగుతుండడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. ఈమధ్య కాలంలో సైలెంట్‌గా ఉన్న గ్రావెల్‌ దొంగలు తాజాగా మళ్లీ పని మొదలు పెట్టారు. దీనిపై రామాంజనేయ కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గురువారం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అనధికార తవ్వకాల వల్ల మైదానం సమీపంలో గుంతలు ఏర్పడతాయని, విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆర్డీవోకు వివరించారు.

Updated Date - Oct 08 , 2026 | 10:58 PM