Share News

different nature గాలి ఆడదు.. చెమట ఆగదు

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:14 AM

different nature ఇంట్లో ఉండలేక.. బయటకు వెళ్లలేక జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి కొనసాగుతోందా అన్నట్లు ఉన్న వేడి వాతావరణానికి పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు.

different nature గాలి ఆడదు.. చెమట ఆగదు

గాలి ఆడదు.. చెమట ఆగదు

ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లా ప్రజలు

వేసవిలా వేడి వాతావరణం

వర్షాలు లేక చల్లదనం కోసం నిరీక్షణ

విజయనగరం, జూలై 13 (ఆంధ్రజ్యోతి):

ఇంట్లో ఉండలేక.. బయటకు వెళ్లలేక జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి కొనసాగుతోందా అన్నట్లు ఉన్న వేడి వాతావరణానికి పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఎండ తక్కువగా ఉన్నప్పటికీ ఉక్కబోతతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. వేడి చూస్తే 45డిగ్రీల ఉష్ణోగ్రతలా ఉంది. జూలై వచ్చిందంటే వర్షాకాలం వచ్చినట్లే కానీ ఎల్‌నినో ప్రభావంతో అనుకున్న సమయానికి వర్షాలు కురవకే ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు సకాలంలో వచ్చినప్పటికీ ఎల్‌నినో ప్రభా వంతో వర్షాలు పడక వర్షాకాలంలో కూడా వేడి వాతావరణం కొనసాగుతోంది. జూన్‌ నెలాఖరు నుంచే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తొలుత ప్రకటించింది. అరకొర వర్షాలు పడినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. వాతావరణం కూడా పెద్దగా చల్లబడలేదు. తాజాగా ఈ నెల 17న అల్పపీడనం ఉండొచ్చునని వాతావరణ నిపుణులు ప్రకటిస్తున్నారు. ఈ ప్రభావంతోనైనా వర్షాలు పడితే వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుందని జిల్లా వాసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ కీలక పనులు ప్రారంభం కాలేదు. లక్షా 35 వేల హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కాగా ఇంతవరకూ 20 వేల హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి. చాలా చోట్ల నారు ఎండిపోతోంది. వాటిని బతికించుకునేందుకు అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు. అల్పపీడనం ఏర్పడి విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఖరీఫ్‌ పనులు పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు.

తేమ శాతం పెరగడం వల్లే

వాతావరణంలో తేమ శాతం పెరిగింది. దీనివల్లే ఉక్కబోత ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఎండకు తోడు తేమ పెరగడంతో ప్రజలు అటు వేడి, ఇటు ఉక్కబోతను ఎదుర్కోవాల్సి వస్తోంది. శరీరంపై మంట పుట్టినట్లు అనిపిస్తోందని అందరూ చెబుతున్నారు. రాత్రి కూడా ఇదే పరిస్థితి నెలకుంటోంది. గాలిలేక వేడి బయటకు వెళ్లడం లేదు. జూలై నెలలో విజయనగరంలో 65 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. ఈ నెల తొలి వారంలో ఓ మోస్తరు వర్షం మాత్రమే పడింది. ఈ సమస్య నుంచి గట్టేక్కాలంటే వర్షాలు పడితే తప్ప ప్రజలకు ఉపశమనం లభించేలా లేదు.

=========

Updated Date - Jul 14 , 2026 | 12:14 AM