Share News

Different There! ఇక్కడ ఇలా.. అక్కడ అలా!

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:07 AM

Different Here, Different There! ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం ఎండ ఠారెత్తిస్తుండగా.. సాయంత్రానికి అక్కడక్కడా వర్షాలు, చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే జిల్లావ్యాప్తంగా వానలు కురవడం లేదు. ఒకచోట కురిస్తే.. మరోచోట అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.

  Different There! ఇక్కడ ఇలా.. అక్కడ అలా!
పాలకొండ: పంట పొలాల్లో చేరిన నీరు

  • జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు

  • కొన్నిచోట్ల పొలాల్లోకి నీరు..

  • మరికొన్నిచోట్ల నేటీకీ నాట్లు వేయని వైనం

  • ఆందోళనలో ఖరీఫ్‌ రైతులు

పాలకొండ/వీరఘట్టం, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం ఎండ ఠారెత్తిస్తుండగా.. సాయంత్రానికి అక్కడక్కడా వర్షాలు, చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే జిల్లావ్యాప్తంగా వానలు కురవడం లేదు. ఒకచోట కురిస్తే.. మరోచోట అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. పాలకొండతో పాటు సీతంపేట మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చివరిదశలో ఉన్న నారుమడికి కాస్త తడి అందింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి పంట పొలాల్లో నీరు చేరింది. దీంతో ఆ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాలకొండకు సమీపంలోనే ఉన్న వీరఘట్టం మండలంలో మాత్రం పూర్తిస్థాయిలో వానలు కురవడం లేదు. దీంతో ఈ ప్రాంత అన్నదాతలు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తోటపల్లి ఎడమ కాలువ మొదటి బ్రాంచ్‌ కాలువలో పూడికలతో నిండిపోవడంతో కిమ్మి, కొట్టుగుమ్మడ, గడగమ్మ గ్రామాలకు సాగునీరు అందడం లేదు. దీంతో నేటికీ చాలామంది వరినాట్లు వేయలేదు. ఏదేమైనా భిన్న వాతావరణ పరిస్థితులతో జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Aug 05 , 2026 | 12:07 AM