మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:14 AM
మండలంలోని శివ్వాం గ్రామానికి చెందిన ఉప్పాడ గణేష్(26) తన తల్లిదండ్రులు మద్యానికి డబ్బులు ఇవ్వలేదని సోమవా రం ఆత్మహత్య చేసుకున్నాడు.
వంగర , ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని శివ్వాం గ్రామానికి చెందిన ఉప్పాడ గణేష్(26) తన తల్లిదండ్రులు మద్యానికి డబ్బులు ఇవ్వలేదని సోమవా రం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ షేక్ శంకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. గణేష్ మద్యం కోసం తన తల్లి దుర్గమ్మను డబ్బులు అడుగుతుండగా, అక్క డే ఉన్న తండ్రి రాము మందలించాడు. నిత్యం మద్యం తాగి గ్రామంలో తమ పరువు తీస్తున్నావని మందలించాడు. అనంతరం తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సందర్భం చూసి.. గణేష్ ఇంట్లో చీరతో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ షేక్ శంకర్ తన సిబ్బందింతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రి కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.