Diarrhea in pogiri villiage పొగిరిలో డయేరియా
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:04 AM
Diarrhea in pogiri villiage పొగిరి గ్రామంలోని ఎగువవీధిలో డయేరియా ప్రబలింది. మూడురోజుల క్రితం ఒకరిద్దరికే పరిమితం కాగా బుధవారం నాటికి స్థానికులు కాంతమ్మ, చిట్టెమ్మ, మంగమ్మ తదితర 15 మంది వ్యాధిబారిన పడ్డారు. విరేచనాలు, వాంతులు అధికం కావడంతో బాధితులలో కొందరు శ్రీకాకుళం, మరికొందరు రాజాంలోని ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించగా ఇంకొందరు రాజాంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పొగిరిలో డయేరియా
వ్యాధిబారిన 15 మంది
అప్రమత్తమైన అధికారులు
గ్రామంలో వైద్యసేవలు
రాజాం రూరల్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పొగిరి గ్రామంలోని ఎగువవీధిలో డయేరియా ప్రబలింది. మూడురోజుల క్రితం ఒకరిద్దరికే పరిమితం కాగా బుధవారం నాటికి స్థానికులు కాంతమ్మ, చిట్టెమ్మ, మంగమ్మ తదితర 15 మంది వ్యాధిబారిన పడ్డారు. విరేచనాలు, వాంతులు అధికం కావడంతో బాధితులలో కొందరు శ్రీకాకుళం, మరికొందరు రాజాంలోని ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించగా ఇంకొందరు రాజాంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పొగిరి పీహెచ్‌సీ వైద్యసిబ్బంది గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్నారు. రాజాం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కరణం హరిబాబు పర్యవేక్షిస్తున్నారు. వీరిద్వారా ఆసుపత్రిలో ఇతరులకు డయేరియా ప్రబలకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామంలో డయేరియా ప్రబలేందుకు తాగునీరు కలుషితం కావడమా, లేదా పారిశుధ్య లోపమా, ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. మిగతావారు వ్యాధిబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యసిబ్బంది గ్రామస్థులకు వివరిస్తున్నారు. ఏదేమైనా గ్రామంలో ఒకేసారి ఎక్కువమంది డయేరియా బారిన పడడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.