Diamond Jubilee వజ్రోత్సవ సందడి
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:54 PM
Diamond Jubilee Celebrations బత్తిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు. శనివారం తొలిరోజు ఆటపాటలు, ఊరేగింపుతో సందడి చేశారు. హైస్కూల్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఎమ్మెల్సీ, డీఈవోతో పాటు ప్రముఖులు హాజరు
భామిని, జనవరి17(ఆంధ్రజ్యోతి): బత్తిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు. శనివారం తొలిరోజు ఆటపాటలు, ఊరేగింపుతో సందడి చేశారు. హైస్కూల్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాల చరిత్రను, గతంలో ఉపాధ్యాయులు అందించే సేవలను గుర్తు చేశారు. హెచ్‌ఎం ఆర్.వి.సన్యాసిరావు నివేదికను చదివి వినిపించారు. టీచర్స్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ.. ఇటువంటి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా పాఠశాల చరిత్రను నేటి తరానికి అందించిన వారమవుతామన్నారు. వసతిగృహం, జూనియర కళాశాల, ఆయుర్వేదిక్ ఆసుపత్రి ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం డీఈవో బ్రహ్మాజీరావు మాట్లాడుతూ.. క్రమశిక్షణ కలిగిన విద్యకు మారుపేరుగా బత్తిలి హైస్కూల్ నిలుస్తుందన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పూర్వ విద్యార్థి, శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్టర్ బి.అడ్డాయి మాట్లాడుతూ.. తన చదువుకు పునాది ఈ హైస్కూల్ అని తెలిపారు. ఇటువంటి ఉత్సవాలు మరిన్ని నిర్వహించాలన్నారు. 1950లో పాఠశాల ఏర్పాటుకు సహకరించిన గోపీనాఽథ్‌పండా, మహంతి మదన్ గోపాలదాస్, విజయకృష్ణదాసులను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాంతికుమారి, ఎంఈవో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.