Dialysis Services సీతంపేటలో డయాలసిస్ సేవలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:01 AM
Dialysis Services in Seethampeta సీతంపేట ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభమయ్యాయి. సోమవారం విజయనగరం జిల్లా ఎస్.కోట ఏరియా ఆసుపత్రి నుంచి వర్చువల్‌గా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
సీతంపేట రూరల్,ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభమయ్యాయి. సోమవారం విజయనగరం జిల్లా ఎస్.కోట ఏరియా ఆసుపత్రి నుంచి వర్చువల్‌గా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిడ్నీ బాధితులకు జరిగే రక్తశుద్ధి విధానాన్ని డీసీహెచ్‌ఎస్ నాగభూషణరావు పరిశీ లించారు. డయాలసిస్ కేంద్రాన్ని రోగులు వినియో గించుకోవాలని ఆయన సూచించారు. ఏజెన్సీలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఈ డయాలసిస్ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో భాస్కరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సివిల్‌సర్జన్ డీవీ శ్రీనివాస్ ఉన్నారు.