Dhanurmasam ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:07 AM
Dhanurmasam Festivities Conclude ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలలో ధనుర్మాస ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. మరోవైపు భోగి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
గరుగుబిల్లి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలలో ధనుర్మాస ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. మరోవైపు భోగి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోవింద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మొత్తంగా దేవస్థానం ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఈవో బి.శ్రీనివాస్, అభివృద్ధి సేవా కమిటీ ప్రతినిధులు భక్తులకు ఉచితంగా ప్రసాదాలు అందించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ప్రాంగణంలో ఈ నెల 29న నిర్వహించనున్న స్వామివారి కల్యాణ మహోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాగత ద్వారాలతో పాటు చలువ పందిర్లు సిద్ధం చేస్తున్నారు. స్వామివారి కల్యాణ మహోత్స వంలో పాల్గొనే భక్తులు ముందుగా దేవస్థాన కార్యాలయంలో వివరాలను నమోదు చేసుకోవాలని ఈవో శ్రీనివాస్ తెలిపారు.