Devotees శంబరకు పోటెత్తినభక్తులు
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:57 PM
Devotees Throng the Festival శంబర పోలమాంబ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి.. అమ్మవారి దర్శనానికి బారులుదీరారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వచ్చిన వారిలో అత్యధికులు కుటుంబాలతో శంబరకు వచ్చారు.
మక్కువ రూరల్, జనవరి17(ఆంధ్రజ్యోతి): శంబర పోలమాంబ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి.. అమ్మవారి దర్శనానికి బారులుదీరారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వచ్చిన వారిలో అత్యధికులు కుటుంబాలతో శంబరకు వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు చెందిన వారు చదురు, వనం గుడిలో ఘటాలను పూజించి పోలమాంబకు మొక్కులు చెల్లించు కున్నారు. కొందరు గుడి ఆవరణలో వంటలు చేసుకుని సామూహిక భోజనాలు చేశారు. కాగా ఉదయం తొమ్మిది గంటల నుంచే భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ సిబ్బంది తగు చర్యలు చేపట్టారు. కాగా సాయంత్రం నాలు గంటల తర్వాత అమ్మవారి ఘటాలు గ్రామంలో ఇంటింటికెళ్లి పూజలందు కున్నాయి. ట్రస్టీ బోర్డు చైర్మన్ చినతిరుపతి, ఈవో శ్రీనివాస్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భద్రత ఏర్పాట్లు పరిశీలన
సాలూరు రూరల్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి ): శంబరలో భద్రత ఏర్పాట్లను సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ నెల 26 నుంచి 28 వరకు జాతర జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. బారికేడ్లు, భక్తులు ఎంట్రీ, ఎగ్జిట్ తదితర ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ తిరుపతితో చర్చించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.