Devotees in Festive Fervor భక్తజన ‘శంబర’ం
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:04 AM
Devotees in Festive Fervor శంబరలో పోలమాంబ మూడోవారం జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి భారీగా భక్తజనం తరలివచ్చి.. అమ్మవారి దర్శ నానికి బారులుదీరారు. దీంతో వనం, చదురు గుడుల ఆవరణలో క్యూలైన్లు ఉదయం తొమ్మిది గంటల నుంచే కిటకిటలాడాయి.
పోలమాంబ దర్శనానికి బారులు
మక్కువ రూరల్, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): శంబరలో పోలమాంబ మూడోవారం జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి భారీగా భక్తజనం తరలివచ్చి.. అమ్మవారి దర్శ నానికి బారులుదీరారు. దీంతో వనం, చదురు గుడుల ఆవరణలో క్యూలైన్లు ఉదయం తొమ్మిది గంటల నుంచే కిటకిటలాడాయి. గంటల కొద్దీ నిరీక్షించిన అనంతరం పోలమాంబను దర్శించుకుని మొక్కులు, ముడుపులు చెల్లించుకున్నారు. వనంగుడి పక్కన ఉన్న అమ్మవారి వేపచెట్టుకు మహి ళలు పెద్దఎత్తున పూజలు జరిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసనాయుడు తదితరులు పోలమాంబను దర్శించుకున్నారు. దేవదాయ శాఖ 7,500 లడ్డూలను సిద్ధం చేయగా.. భక్తులకు ఉచితప్రసాదం కూడా పంపిణీ చేశారు. పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాలూరు సీఐ పి.రామకృష్ణ, మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ ఆధ్వర్యంలో 170 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.