సాలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:19 AM
రాష్ట్ర వ్యాప్తంగా రూ.5,500 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) పథకం సీఎం నారా చంద్రబా బు నాయుడు కుప్పంలో ప్రారంభించనున్నారని, అం దులో భాగంగానే సాలూరు మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల హెచ్‌ఏఎం నిధులను తీసుకొచ్చామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు.
హెచ్‌ఏఎం ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం
రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి
సాలూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా రూ.5,500 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) పథకం సీఎం నారా చంద్రబా బు నాయుడు కుప్పంలో ప్రారంభించనున్నారని, అం దులో భాగంగానే సాలూరు మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల హెచ్‌ఏఎం నిధులను తీసుకొచ్చామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. సోమవారం సాలూరులో ములిసి పాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సమస్య లపై సంధ్యారాణి సమీక్షించారు. హెచ్‌ఏఎం నిధుల తో పట్టణంలో మౌలిక వసతుల అభివృ ద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. వీధిలైట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర ప్రాథమిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశిం చారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యా లయం వరకు రూ.44 లక్షలతో చేపట్టిన సెంటర్ లైటింగ్ పనులను పూర్తిచేయాలని కోరారు. స్థానిక రైతు బజార్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావ డానికి రెవెన్యూ, పోలీసు, మునిసిపల్, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పట్టణం లోని అన్ని వార్డుల్లో ఇప్పటికే పైలెట్ వాటర్ స్కీమ్ లు ఏర్పాటు చేశామని, అవసర మున్న ఇతర వార్డుల్లోనూ కొత్త వాటర్ స్కీ ము లను మంజూరు చేస్తామని చెప్పారు. పాలనలో పారదర్శకత ఉండాలని, ప్రజలను ఇబ్బంది పెట్టేలా అధికారులు వ్యవ హరిం చొద్దని కోరారు. ప్రజల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలుచేస్తే సహించేది లేదని కఠినంగా తెలి పారు. సమావేశంలో జేసీ, మునిసిప ల్ ప్రత్యేకాధికారి ఆర్.వైశాలితో పాటు మునిసిపల్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధు లు పాల్గొన్నారు.