రూ.8కోట్లతో నెల్లిమర్లలో అభివృద్ధి పనులు
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:26 AM
నెల్లిమర్ల నగర పంచాయతీలో మౌలిక సదుపాయా ల కల్పనకు రూ.8కో ట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.
ఎమ్మెల్యే నాగమాధవి
నెల్లిమర్ల, జూలై 25(ఆంధ్ర జ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీలో మౌలిక సదుపాయా ల కల్పనకు రూ.8కో ట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. నెల్లిమర్లలో రూ.4.42 కోట్లతో నిర్మించిన సీహెచ్‌సీ నూతన భవనాన్ని ఆమె శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లిమర్ల అభివృద్ధికి రూ.5కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.3కోట్లు కూడా మంజూరవుతాయని ఆమె వెల్లడించారు. నెల్లిమర్లలో మౌలిక సదుపాయల కల్పన కు చర్యలు వేగవంతం చేశామని, కేవలం రెండు నెలల్లో రోడ్లు, కాలువల నిర్మాణా లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ సీ సూపరింటెండెంట్ డా.గీతా భవానీ, నగర పంచాయతీ కమిషనర్ కిలాన అప్పల రాజు, జనసేన పార్టీ నాయకులు చనమల్లు వెంకటరమణ, అప్పికొండ రవికుమార్, రవ్వా నాని, కరుమజ్జి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.