Share News

Development Works అభివృద్ధి పనులు వేగవంతం

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:20 PM

Development Works Accelerated పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న ఇంజనీరింగ్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పీవో ఆర్‌.వైశాలి ఆదేశించారు.

Development Works   అభివృద్ధి పనులు వేగవంతం
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో

  • నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

పార్వతీపురం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న ఇంజనీరింగ్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పీవో ఆర్‌.వైశాలి ఆదేశించారు. నిర్ధేశిత గడువులోగా నాణ్యతతో నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. గురువారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రోడ్లు, భవనాలు, విద్యా సంస్థలు, తాగునీటి పనుల పురోగతిపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ఆయా పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jul 16 , 2026 | 11:20 PM