Share News

కూటమితోనే అభివృద్ధి

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:59 PM

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల అన్నారు.

కూటమితోనే అభివృద్ధి

  • రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల

రాజాం రూరల్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల అన్నారు. ఆదివారం ఆయన రాజాంలో పర్యటించారు. ఈసందర్భంగా పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సహకారంతో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ రాజాంను అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌, జడ్పీ మాజీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, సుడా చైర్మన్‌ కొరికాన రవికుమార్‌, జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి పొగిరి సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:59 PM