కూటమితోనే అభివృద్ధి
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:18 AM
కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు.
పార్వతీపురం రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం నర్సిపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీను నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధి జరుగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాల్జేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ గొట్టాపు గౌరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకుడు చందక అనీల్ మాట్లాడారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు గొట్టాపు వెంకటనాయుడు, హనుమంతు శంకరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ వేణు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాశ్ నారాయణతో పాటు పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, పార్వతీపురం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.