రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:18 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో పరుగులు తీస్తున్నాయని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.
చీపురుపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో పరుగులు తీస్తున్నాయని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. చీపురుపల్లి లావేరు రోడ్డు నుంచి పేరిపి, ఇటకర్లపల్లి, జి.ములగాం మీదుగా చిననడిపల్లి వరకూ రూ.3.11 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన తారురోడ్డు పనులకు ఆయన శనివారం అలజంగి వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు. గత రెండేళ్లలో చీపురుపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.25కోట్లతో పలు రోడ్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, ఎలకల అప్పారావునాయుడు, శనప తి శ్రీనివాసరావు, పనస జానకిరామ మణికంఠ, గం ట్యాడ సత్యనారాయణ, మహంతి అప్పలనాయుడు, తహసీల్దార్ డి.ధర్మరాజు, డిప్యూటీ ఎంపీడీవో అప్పల నాయయుడు, ఆర్‌అండ్‌బీ జేఈ కె.మురళీబాబు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.