Government కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:19 AM
Development Possible Only Under the Coalition Government కూటమి ప్రభుత్వంతోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పాంచాలి పంచాయతీ పరిధి జీలుగువలసలో సోమవారం ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమాన్ని చేపట్టారు.
జీలుగువలసలో ‘ఇంటింటికీ టీడీపీ’
పాచిపెంట రూరల్, జూలై27(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పాంచాలి పంచాయతీ పరిధి జీలుగువలసలో సోమవారం ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు థింసా నృత్యంతో మంత్రిని ఆహ్వానించారు. తొలుత ఆమె ఇంటింటికీ వెళ్లి.. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. దీంతో స్థానికులు.. గురువునాయుడుపేట నుంచి గ్రామానికి అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా సబ్ డిపో ఏర్పాటు చేయాలని, అర్హులైన రైతులకు డీ పట్టాలు మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రాలు అందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం ఎగువ జీలుగువలస, దిగువ జీలుగువలస, సీతశీపేట గ్రామాలకు చెందిన సుమారు 250 మంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి మంత్రి సంధ్యారాణి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు యుగంధర్ , ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.