Share News

కూటమితోనే అభివృద్ధి

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:10 AM

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి అన్నారు.

కూటమితోనే అభివృద్ధి
ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట నినాదాలు చేస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

ఘనంగా విజయోత్సవ సభ

కురుపాం, జూన్‌15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నియోజకవర్గం కేంద్రమైన కురుపాంలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీనగర్‌ కూడలిలోని దివంగత ఎన్టీఆర్‌ విగ్రహనికి ఆమెతో పాటు నియోజకవర్గ టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచక పాలన, అవినీతి, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ఆర్థికంగా, అభివృద్ధిపరంగా పూర్తిగా వెనుకబడిందని విమర్శించారు. ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. రెండేళ్ల కాలంలో విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారకత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక రంగాల్లో ప్రభుత్వం విశేష ప్రగతి సాధించిందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింద న్నారు. సీఎం చంద్రబాబు.. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్‌ డొంకాడ రామకృష్ణ, అరుకు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, ఏఎంసీ చైర్మన్‌ కడ్రక కళావతి, టీడీపీ నాయకులు శేఖర్‌పాత్రుడు, కోలా రంజిత్‌కుమార్‌, కెవి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 12:10 AM