Share News

Tribal Areas గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:37 AM

Development of Tribal Areas is the Goal గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఐటీడీఏ గిరిమిత్ర హాల్‌లో యాక్షన్‌ప్లాన్‌ రూపకల్పనపై జిల్లా స్థాయి అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో చర్చించారు.

 Tribal Areas గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

పార్వతీపురం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఐటీడీఏ గిరిమిత్ర హాల్‌లో యాక్షన్‌ప్లాన్‌ రూపకల్పనపై జిల్లా స్థాయి అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో చర్చించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్య రంగాల అంశాలపై ఆరా తీశారు. గిరిజన గ్రామాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులను గుర్తించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి సౌకర్యం, రక్షిత నీటి సరఫరా, విద్యుత్‌, అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య కేంద్రాల పటిష్ఠతపై దృష్టి సారించాలని గిరిజన సంఘాల నేతలు కోరారు.

Updated Date - Apr 14 , 2026 | 12:37 AM