Share News

కూటమితోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:16 AM

కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి అన్నారు.

కూటమితోనే అభివృద్ధి సాధ్యం
సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో రూ.20 లక్షలతో నిర్మించిన సిమెంట్‌ రహదారిని గురువారం ఆమె ప్రారం భించారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడు తూ దశాబ్దాలుగా స్థానికులు పడుతున్న ఇబ్బం దులు గుర్తించిన ప్రభుత్వం రహదారి నిర్మాణా నికి పెద్దపీట వేసిందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అవస్థలు తప్ప అభివృద్ధి కానరాలేద న్నారు. ప్రస్తుతం నిర్మించిన సీసీ రహదారి వల్ల రాకపోకలు సులభతరం అవుతాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ కడ్రక కళావతి, మండల కన్వీనర్‌ నరేష్‌, కూటమి నాయకులు వెంపటాపు భారతి, పాడి సుదర్శనరావు, మండంగి భూషణరావు, ఆరిక జానకి, కడ్రక అప్పలస్వామి, నిమ్మక సింహాచలం, చిన్న, రాజేశ్‌, అనిల్‌, దొరబాబు, రామారావు, దమయంతి, రామకృష్ణ, కొండలరావు, లోవరాజు, బాలు, మన్మఽథ, గుంజన్నపాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:16 AM