Share News

కూటమితోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:17 AM

కూటమి ప్రభుత్వం తోనే నగర పంచాయతీ అభివృద్ధి సాధ్యమని పాలకొండ, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తెలిపారు.

కూటమితోనే అభివృద్ధి సాధ్యం
ప్రచారంలో మాట్లాడుతున్న జయకృష్ణ, పక్కన విజయనిర్మల

  • ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్సీ గ్రీష్మ

పాలకొండ, అక్టోబరు24(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తోనే నగర పంచాయతీ అభివృద్ధి సాధ్యమని పాలకొండ, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తెలిపారు. శనివారం పాలకొండ నగర పంచాయతీలోని కూటమి అభ్య ర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మేజర్‌ పంచాయతీగా ఉన్న పాలకొండను నగర పంచాయతీగా తీర్చిదిద్దింది కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. 2021 నుంచి 2026 వరకు వైసీపీ ప్రభుత్వం హయాంలో నగర పంచాయతీ అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. నగర పంచాయతీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇప్ప టికే నగర పంచాయతీలో శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.72 కోట్లతో రక్షిత మంచినీటి పథకాలు, ఇంటిం టికి కొళాయి కనెక్షన్లు ఏర్పాటుకు పనులు చేపట్టామన్నారు. సుమారు రూ.రెండు కోట్లతో వెంకటరాయుని కోనేరు సుందరీకర ణకు సుడా నిధులు కేటాయించామన్నారు. జనసేన నుంచి పోటీ చేస్తున్న చైర్‌పర్సన్‌ అభ్యర్థి పల్లావిజయనిర్మలకు అన్ని వార్డులు నుంచి అత్యధిక ఓటర్ల మెజార్టీతో గెలిపించాలన్నారు. గొల్లవీధి నుంచి చినకాపువీధి వరకు 1, 2 వార్డుల్లో పర్యటించారు. ఒకటి, రెండు వార్డుల్లో టీడీపీ అభ్యరులుగా పోటీ చేస్తున్న గంటా వరలక్ష్మి, గంటా సంతోష్‌కుమార్‌లను గెలిపించాలని కోరారు.కార్య క్రమంలో కూటమి నాయకులు పడాల భూదేవి, పల్లా కొండల రావు, ఆరో వార్డు కౌన్సిలర్‌ అభ్యర్ధి కోలా లక్ష్మీతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 12:17 AM