అన్నిరంగాల్లో అభివృద్ధి
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:56 PM
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని టీడీపీ పార్టీ నాయకులు తెలిపారు. బుధవారం జిల్లాలో ఇంటింటికీ టీడీపీ కార్య క్రమం నిర్వహించారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని టీడీపీ పార్టీ నాయకులు తెలిపారు. బుధవారం జిల్లాలో ఇంటింటికీ టీడీపీ కార్య క్రమం నిర్వహించారు.
ఫ రాజాం, ఆగస్టు 5 (ఆంద్రజ్యోతి): ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని, సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అయ్యిందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు. శ్యాంపురంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్నిక ముందు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని అన్నివిధాలుగా నాశనం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గురవాన నారాయ ణరావు, వంగా వెంకటరావు, సర్పంచ్ చీడి రమణ, బోను నారాయణరావు, పిల్లా సత్యంనాయుడు, మాడుగుల జయరాం, దూబ ధర్మారావు, శంకరరావు పాల్గొన్నారు.
ఫ కొత్తవలస, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధే ఎజెండాగా కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా పాలన సాగిస్తోందని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. కొత్తవలసలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. తొలుత మరిడిమాంబ అమ్మవారి ఆలయం నుంచి రామాలయం వరకు నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, టీడీపీ మండలాధ్యక్షుడు కోళ్లవెంకటరమణ, నాయకులు బొబ్బిలి అప్పారావు, గొరపల్లిరాము, వల్లెపుకైలాస్, కర్రి సూర్యనూకరాజు, కొరుపోలు అప్పారావు, జనసేన నాయకుడు అప్పారావు పాల్గొన్నారు.
ఫ విజయనగరం రూరల్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ రెండేళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని వెలమ కార్పొరేషన్ చైర్మన్, విజయనగరం నియోజక వర్గ టీడీపీ పరిశీలకుడు పీవీజీ కుమార్ చెప్పారు. బుధవారం విజయ నగరం నగరపాలక సంస్థ పరిధిలోని 87, 88 బూత్‌ల్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముద్దాడ చంద్రశేఖర్, ఎ.శంకర రావు, గుడివాడ మోహనరావు, కోరాడ మహేష్, సీర సత్యనారాయణ, గేదేల సతీష్, బర్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.