కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:26 AM
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ నాయకులు తెలిపారు. శుక్రవా రం జిల్లాలో పలుచోట్ల ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలో పలుచోట్ల ఇంటింటికి టీడీపీ కార్యక్రమం
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ నాయకులు తెలిపారు. శుక్రవా రం జిల్లాలో పలుచోట్ల ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా ప్రభుత్వం రెండేళ్లలో అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను నాయకులు ప్రజలకు వివరించారు.
గరుగుబిల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పన కూటమి ప్రభుత్వంతో సాధ్యమవుతుందని టీడీపీ మండలాధ్యక్షుడు మరడాన నారాయణస్వామి తెలిపారు. మండలంలోని మరుపెంట, సాంబన్నవలస, గొల్లవానివలస, తులసిరామినాయుడువలస గ్రామాల్లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఉరిటి రామారావు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ఎం.తవిటినాయుడు, నాగూరు ప్రాదేశిక సభ్యులు ద్వారపురెడ్డి సత్యనారాయణలు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ హయంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రెండేళ్ల కాలంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు కె.బలరాంనాయుడు, జి.రామారావు, వెంకటనాయుడు, ఎ.నారాయణరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
వీరఘట్టం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమని టీడీపీ మండల క్లస్టర్ ఇన్‌చార్జి ఖండాపు వెంకటరమణ తెలిపారు. వీరఘట్టంలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు. స్థానికసంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సాసుబిల్లి వెంకటరమణ, తూముల రమేష్, పప్పల మహేష్ తదితరులు పాల్గొన్నారు.