Share News

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ధ్యేయం

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:32 AM

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ధ్యేయం
కరపత్రాలను పంపిణీ చేస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం పట్టణంలోని 8వ వార్డులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజ లు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అందుకు సంబంఽధించిన కరపత్రాలను అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త రామారావును పరామర్శిం చారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ సంక్షేమ ఫలా లను అర్హులైన ప్రతీ ఒక్కరికి చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అన్ని రంగా లకు లబ్దిచేకూర్చేలా పలు పథకాలను ప్రవేశపెట్టారన్నారు. స్థానిక ఎన్నిక ల్లో టీడీపీకి ఘన విజయం అందించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, నాయకులు కాళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:32 AM