Road Construction రహదారుల నిర్మాణంతో అభివృద్ధి వేగవంతం
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:01 AM
Development Accelerated Through Road Construction రహదారుల నిర్మాణంతో అభివృద్ధి వేగవంతమవు తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మక్కువలో ప్రధాన రహదారి విస్తరణ, కాలువల పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు.
మక్కువ రూరల్, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): రహదారుల నిర్మాణంతో అభివృద్ధి వేగవంతమవు తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మక్కువలో ప్రధాన రహదారి విస్తరణ, కాలువల పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.3.75 కోట్లతో మక్కువ మజ్జిగౌరమ్మ ఆలయం నుంచి సువర్ణముఖి నది వంతెన వరకు రోడ్డు నిర్మాణం, విస్తరణతో పాటు కాలువల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం తొలివిడతగా రూ.2.65కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో మక్కువను సంపూర్ణంగా అభివృద్ధి చేసి మక్కువవాసుల 40ఏళ్ల కలను నెరవేరుస్తామన్నారు. అన్ని గ్రామాల్లో దశలవారీగా రోడ్లను నిర్మించి ప్రధాన రహదారులకు అనుసంధానం చేస్తామని తెలిపారు. మక్కువలో రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని వ్యాపారాలు చేసుకుంటున్న వారు విస్తరణ పనులకు సహకరించాలని కోరారు. మక్కువ-సాలూరు రోడ్డు నిర్మాణానికి రూ.18కోట్లు మంజూర య్యాయని, ప్రస్తుతం బాగువలస వరకు రూ.5.5కోట్లతో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. డోలీ రహిత గ్రామాలే లక్ష్యంగా సాలూరు నియోజకవర్గంలో 60కోట్లతో సీసీ రోడ్లు, రూ.17.70కోట్లతో 54 బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేణు గోపాలనాయుడు, రమణ, మల్లేశ్వరరావు, కేసవరావు తదితరులు పాల్గొన్నారు.