క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయండి
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:06 AM
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయా లని మున్సిపల్ కమిషనర్ పావనిని మార్నింగ్ స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు పి.సత్యనారాయణతో పాటు సభ్యులు కోరారు.
పార్వతీపురం టౌన్, జనవరి2 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయా లని మున్సిపల్ కమిషనర్ పావనిని మార్నింగ్ స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు పి.సత్యనారాయణతో పాటు సభ్యులు కోరారు. శుక్రవారం పట్టణం లోని కళాశాల క్రీడా మైదానాన్ని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మార్నింగ్ స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు ఆమెతో మాట్లాడారు. వందేళ్ల చరిత్ర కలిగిన క్రీడా మైదానం వల్ల ఎంతో మంది క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి రాణించారన్నారు. అలాంటి మైదానం నేడు నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు. క్రీడా మైదానం అభి వృద్ధిపై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.