‘అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించండి’
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:09 AM
ప్రాథమిక పాఠశాలలో ఒకటి, రెండు తరగతులు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలని డీఈవో పి.బ్రహ్మాజీరావు అన్నారు.
బెలగాం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాలలో ఒకటి, రెండు తరగతులు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలని డీఈవో పి.బ్రహ్మాజీరావు అన్నారు. గురువారం స్థానిక డీవీఎం మున్సిపల్ హైస్కూల్‌లో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో 1, 2, తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం ధారాళంగా చదవడం, రాయడంతో పాటు గణితంలో చతుర్విద ప్రక్రియలో అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడమే శిక్షణ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సాంబశివచలం, రాజ్‌కుమార్, సురేష్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.