రోడ్డు రోలర్‌తో సైలెన్సర్ల ధ్వంసం
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:00 PM
శబ్ద, వాయు కాలుష్యానికి కారణమవుతు న్న ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు.
విజయనగరం క్రెం, మార్చి 17 (ఆంధ్రజ్యో తి): శబ్ద, వాయు కాలుష్యానికి కారణమవుతు న్న ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో మంగళవారం ట్యాంక్ బండ్ రోడ్డుపై 550 సైలెన్సర్లను వేసి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొందరు ద్విచక్ర వాహనదారు లు తమ బైక్‌లకు భారీ శబ్దం చేసే సైలెన్స ర్లను అమర్చుతున్నారని తెలిపారు. వీటివల్ల పట్టణాలు, పల్లెలు, నగరాల్లో తీవ్ర శబ్ద కాలు ష్యం నెలకొంటుందని, గర్భిణులు, చిన్నారులు, వృద్ధులతో పాటు దీర్ఘకాలిక రోగులు ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు. వీటిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు సంబంధిత ద్విచక్ర వాహ నదారుల ఫోన్ నెంబర్లను ఆర్టీవో కార్యాల యం నుంచి సేకరించామన్నారు. వారి వాహ నాల నుంచి సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేయించినట్లు చెప్పారు. శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లను వినియోగించినా, తయారుచేసినా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. నిబంధనలు పాటించాలని అన్నారు.