Share News

వంటపాకల ధ్వంసం

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:19 AM

మండలంలోని గజపతినగరం గిరిజన కాలనీలో ఏనుగులు గుంపు శనివారం వేకువజామున బీభత్సం సృష్టించింది.

వంటపాకల ధ్వంసం
మూలగూడ రోడ్డులో సంచరిస్తున్న ఏనుగుల గుంపు

  • గజపతినగరం గిరిజన కాలనీలో ఏనుగుల బీభత్సం

భామిని, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గజపతినగరం గిరిజన కాలనీలో ఏనుగులు గుంపు శనివారం వేకువజామున బీభత్సం సృష్టించింది. పత్తిక జయమ్మ, కె.లక్ష్మమ్మ, రమేష్‌, ఆనందరావులకు చెం దిన వంట పాకలను ధ్వంసం చేశాయి. ధ్వంసమైన వంటపాలకు చూసి భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని జీడితోటలో ఉన్న ఆదివాసీ గిరిజనులు కోళ్లపెంపకం షెడ్‌ను విధ్వంసం చేశాయి. సాయంత్రం మూలగూడ రహదారిలో సంచరించడంతో రాకపొకలకు గిరిజనులకు భయపడ్డారు. అటవీశాఖ బీట్‌ అధికారి కేశవ ధ్వంసమైన పంటలను నమోదు చేశారు. ఏనుగులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Updated Date - Nov 01 , 2026 | 12:19 AM