Share News

బాక్సులో భవితవ్యం

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:47 AM

Destiny in a Box ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి ఘర్షణలు లేకపోవడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. మొత్తం 27 జడ్పీటీసీ స్థానాలకు, 438 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. జిల్లా వ్యాప్తంగా 1586 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియ సాగింది. పూర్తి వెబ్‌కాస్టింగ్‌ రికార్డింగ్‌లో పటిష్ఠ బందోబస్తు నడుమ ప్రాదేశిక ఎన్నికలు పూర్తయ్యాయి. జిల్లాలో 76.18 శాతం ఓటింగ్‌ నమోదైంది. గత ప్రాదేశిక ఎన్నికల్లో 65 శాతం మాత్రమే నమోదైంది.

బాక్సులో భవితవ్యం

బాక్సులో భవితవ్యం

పరిషత్‌ పోలింగ్‌ ప్రశాంతం

76.18 శాతం నమోదు

గత ఎన్నికలకంటే తగ్గిన వైనం

రేపు కౌంటింగ్‌

ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి ఘర్షణలు లేకపోవడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. మొత్తం 27 జడ్పీటీసీ స్థానాలకు, 438 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. జిల్లా వ్యాప్తంగా 1586 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియ సాగింది. పూర్తి వెబ్‌కాస్టింగ్‌ రికార్డింగ్‌లో పటిష్ఠ బందోబస్తు నడుమ ప్రాదేశిక ఎన్నికలు పూర్తయ్యాయి. జిల్లాలో 76.18 శాతం ఓటింగ్‌ నమోదైంది. గత ప్రాదేశిక ఎన్నికల్లో 65 శాతం మాత్రమే నమోదైంది.

విజయనగరం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 76.18 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాతకాలు బ్యాలెట్‌ బాక్సుల్లోకి చేరాయి. ఏ పెట్టెలో ఎవరి విజయం దాగుందోనని అందరూ ఆసక్తిగా ఉన్నారు. కౌంటింగ్‌ తేదీ కోసం నిరీక్షిస్తున్నారు. విజయావకాశా లపై అభ్యర్థులు లెక్కలు వేయడం ప్రారంభించారు. ఏబూత్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయోనని కూడికలు, తీసివేతలతో బిజీగా మారారు. జిల్లా వ్యాప్తంగా 27 జడ్పీటీసీ స్థానాలకు 103 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 449 ఎంపిటిసీ స్థానాలుండగా 11 ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో గురువారం 438 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 1066 మంది పోటీలో ఉన్నారు. అయితే టీడీపీ అభ్యర్థులదే పైచేయిగా కనిపించగా అక్కడక్కడ వైసీపీ అభ్యర్థులు హవా చూపించే అవకాశాలు లేకపోలేదు. జిల్లాలో 12,85,692 మంది ఓటర్లు ఉండగా, 9,79, 386 మంది ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు.

పోలింగ్‌ సరళి ఇలా..

గురువారం ఉదయం 7 నుంచి 9 గంటలు వరకూ 7.6 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లాలో 44.4 శాతం మాత్రమే నమోదైంది. మధ్యాహ్నాం 3 గంటల వరకూ 60.67 శాతం పోలింగ్‌ నమోదైంది. 5 గంటలు సమయానికి 71.19 శాతం జరిగింది. కొన్ని కేంద్రాల్లో 5 గంటలకు ఓటర్లు క్యూలో వేచి ఉండటంతో వారికి సీరియల్‌ నెంబరు స్లిప్లులు ఇచ్చి, గేట్లు మూసివేసి వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో పోలింగ్‌ పూర్తిగా ముగిసే సమయానికి 76.18 శాతం పోలింగ్‌ నమైనట్లు అధికారులు వెల్లడించారు.

పకడ్బందీ బందోబస్తు

జిల్లాలో 39 సమస్యాత్మక, 388 సున్నిత, 323 అత్యంత సున్నిత గ్రామాలను గుర్తించి 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

ఫ పోలింగ్‌ ముగిసిన తరువాత 7 నియోజకవర్గాల్లోని బ్యాలెట్‌ బాక్సులను 7 స్ర్టాంగ్‌ రూమ్‌లకు తరలించారు. శనివారం లెక్కింపు జరగనుంది. 36 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. 433 మంది పర్యవేక్షకుల ఆధ్వర్యంలో లెక్కింపు కొనసాగనుంది.

ఫ ప్రాదేశిక పోలింగ్‌ ప్రక్రియను కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

భద్రతను పర్యవేక్షించిన ఐజీ, ఎస్పీ

విజయనగరం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగు ప్రక్రియను విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టీ, ఎస్పీ దామోదర్‌లు పర్యవేక్షించారు. పూసపాటిరేగ మండలం కుమిలి పోలింగు స్టేషన్‌ వద్ద ఏర్పాట్లను జట్టీ పరిశీలించారు. 100 మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా మిగతా వ్యక్తులను ఎవరినీ అనుమతించ వద్దని, పార్టీ కండువాలు, గుర్తులు ధరించి పోలింగు కేంద్రాల వద్దకు రాకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ దామోదర్‌ నెల్లిమర్ల మండలంలోని గొర్లెపేట, కొత్తపేట, రామతీర్థం, గుర్ల మండలంలోని కెల్ల, గుజ్జింగివలస, జమ్ము, గరివిడి మండలంలోని కొండపాలెం, శ్రీరామ్‌నగర్‌, చీపురుపల్లి మండలంలోని చీపురుపల్లి, మెరకముడిదాం మండలంలోని గర్భాం ప్రాంతాలను సందర్శించి ఓటర్ల భద్రతకు సంబంధించిన సూచనలు ఇచ్చారు.

ధర్మవరంలో గొడవలు

ఎస్‌.కోట రూరల్‌, నవంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): ధర్మవరంలో రెండు వర్గాల తోపులాట స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. మధ్యాహ్న భోజన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పోలింగ్‌ బూత్‌లలోకి ప్రవేశించి ప్రచారం చేస్తున్నారని పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఇరువర్గాలు గొడవ పడ్డాయి. ఆ సమయంలో ఒకరినొకరు నెట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నవీన్‌పడాల్‌ సిబ్బందితో చేరుకొని పోలీంగ్‌స్టేషన్‌ వద్ద గుంపులను చెదరగొట్టారు. స్వల్పంగా లాఠీ చార్జీ చేసి బయటకు పంపించారు. ఆ తర్వాత పోలింగ్‌కేంద్రం బయట కూడా గొడవ జరిగింది.

‘మందు’చూపు

విజయనగరం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం నుంచి మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. గ్రామాల్లో మద్యం ఏరులై పారింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి పార్టీల నాయకులు మద్యాన్ని విచ్చలవిడిగా నిల్వ చేశారు. మద్యం సీసాలు అందిస్తూ ప్రచారం నిర్వహించారు. ఏ పార్టీకి చెందిన ఆ పార్టీ నాయకులు వారి, వారి సంబంధీకుల నివాసాల్లో మద ్యం నిల్వ చేశారు. నెల్లిమర్ల ఐఎంఎల్‌ డిపో నుంచి రెండో తేదీ ఒక్కరోజే జిల్లాలోని 158 మద్యం షాపులు, 23 బార్లకు రూ.14 కోట్ల 23 లక్షల 21 వేల 592 రూపాయల ఆదాయం ప్రభుత్వానికి లభించింది.

-------------

Updated Date - Nov 06 , 2026 | 12:47 AM