Deputy CM's డిప్యూటీ సీఎం పర్యటన మళ్లీ వాయిదా
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:03 AM
Deputy CM's visit postponed again. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లా పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ నెల 24న బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో ఆయన పర్యటించాల్సి ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు బుధవారం డిప్యూటీ సీఎం పేషీ నుంచి కలెక్టరేట్‌కు సమాచారం అందింది.
పార్వతీపురం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లా పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ నెల 24న బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో ఆయన పర్యటించాల్సి ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు బుధవారం డిప్యూటీ సీఎం పేషీ నుంచి కలెక్టరేట్‌కు సమాచారం అందింది. తదుపరి పర్యటన షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేయనున్నారు. పెదపెంకి గ్రామంలో ఫైలేరియా కేసులు అధికంగా నమోదవడం, తరచూ ప్రజలు జ్వరాల బారిన పడుతుండడంతో డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు మ్యాజిక్ డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 49 పనులకు రూ.6.36 కోట్లతో గతేడాది పనులు చేపట్టారు. అయితే సకాలంలో పనులు పూర్తికాకపోవడంతో గతంలో రెండు సార్లు డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా పడింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిర్మాణాలు ఊపందు కున్నాయి. అయితే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో మూడోసారి ఉప ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడింది.