Share News

Deputy Chief Minister ఉపముఖ్యమంత్రి పర్యటన ఖరారు

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:20 AM

Deputy Chief Minister's Tour Finalised ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 24న బలిజిపేట మండలం పెదపెంకిలో పర్యటించనున్నట్లు శనివారం అధికార వర్గాలు తెలిపాయి.

Deputy Chief Minister  ఉపముఖ్యమంత్రి పర్యటన ఖరారు

పార్వతీపురం, జూన్‌20(ఆంరఽధజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 24న బలిజిపేట మండలం పెదపెంకిలో పర్యటించనున్నట్లు శనివారం అధికార వర్గాలు తెలిపాయి. బోద వ్యాధి నివారణలో భాగంగా ఇప్పటికే ఆ గ్రామంలో జోరుగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మ్యాజిక్‌ డ్రైన్లు, రహదారుల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం వచ్చేలోగా అవి పూర్తవుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2018లో పవన్‌ బొబ్బిలి వచ్చిన సందర్భంగా పెదపెంకి గ్రామస్థులు బోద వ్యాధి వ్యాప్తి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అప్పటి నుంచి పవన్‌ పెదపెంకిపై దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సుమారు రూ.ఆరు కోట్ల మంజూరు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:20 AM