Share News

Deputy Chief Minister 6న ఉపముఖ్యమంత్రి రాక

ABN , Publish Date - Jul 01 , 2026 | 11:54 PM

Deputy Chief Minister to Visit on July 6 రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న జిల్లాకు రానున్నారు. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో పర్యటిం చనున్నారు.

Deputy Chief Minister  6న ఉపముఖ్యమంత్రి రాక

పార్వతీపురం, జూలై1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న జిల్లాకు రానున్నారు. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో పర్యటిం చనున్నారు. 2018లో పవన్‌ బొబ్బిలి వచ్చిన సందర్భంగా పెదపెంకి గ్రామస్థులు బోద వ్యాధి వ్యాప్తి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అప్పటి నుంచి పవన్‌ పెదపెంకిపై దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సుమారు రూ.ఆరు కోట్ల మంజూరు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ పర్యటనకు ముందుగా పెదపెంకిలో మ్యాజిక్‌ డ్రైన్లు, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Jul 01 , 2026 | 11:54 PM