గత ఐదేళ్లూ రాష్ట్రంలో దెయ్యాల పాలన
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:18 AM
రాష్ట్రంలో గత ఐదేళ్లూ దెయ్యాల పాలన నడిచిందని, ఆ కారణంగానే అభివృద్ధి జాడ కనిపించలేదని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.
చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు
చీపురుపల్లి/ మెరకముడిదాం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యో తి): రాష్ట్రంలో గత ఐదేళ్లూ దెయ్యాల పాలన నడిచిందని, ఆ కారణంగానే అభివృద్ధి జాడ కనిపించలేదని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. రావివలసలో శనివారం జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన ఐదేళ్ల కాలంలో ప్రాజక్టులకు ఒక్క పైసా కూడా విదల్చలేదన్నారు. చీపురుపల్లిలోని తోటపల్లి ప్రాజక్టుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కారణంగా ఐదు వేల కోట్ల పెట్టుబడితో గుర్ల సమీపంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు అవుతుందని తెలిపా రు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవస్థల న్నింటినీ నాశనం చేసిందన్నారు.