Share News

Delivery on Train రైలులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:57 PM

Delivery on Train; Mother and Baby Safe అమృత భారత్‌ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రసవించింది. మంగళవారం పార్వతీపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

Delivery on Train  రైలులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
పార్వతీపురం ఆసుపత్రికి వెళ్తున్న తల్లీబిడ్డ

బెలగాం, మార్చి24(ఆంధ్రజ్యోతి): అమృత భారత్‌ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రసవించింది. మంగళవారం పార్వతీపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. జీఆర్‌పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వప్నకుమారి అనే గర్భిణి తన భర్త రవిలోహ్రోతో కలిసి అమృత భారత్‌ రైలులో రూర్కెలా నుంచి జోలార్‌కు వస్తున్నారు. ఏడు నెలల గర్భిణి అయిన ఆమెకు మార్గమాధ్యంలో నొప్పులు వచ్చాయి. దీంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే భర్త జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో అరగంట పాటు రైలును నిలుపుదల చేశారు. తోటి మహిళా ప్రయాణికుల సాయంతో రైలులోనే స్నప్నకుమారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా జీఆర్‌పీ పోలీసులు పార్వతీపురం స్టేషన్‌వద్ద అంబులెన్స్‌ను సిద్ధం చేసి.. స్వప్నకుమారి, బిడ్డను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వైద్యులు.. తల్లీబిడ్డకు అవసరమైన చికిత్సను అందించారు. వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు వెల్లడించారు.

Updated Date - Mar 24 , 2026 | 11:57 PM