Share News

కోటదుర్గమ్మను దర్శించుకున్నఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:47 PM

ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ అమ్మవారిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గేదెల తుషార్‌కుమా ర్‌ గురువారం దర్శించు కున్నారు.

కోటదుర్గమ్మను దర్శించుకున్నఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
న్యాయమూర్తి జస్టిస్‌ తుషార్‌కుమార్‌కు ఆశీర్వచనం అందిస్తున్న అర్చకులు

పాలకొండ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ అమ్మవారిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గేదెల తుషార్‌కుమా ర్‌ గురువారం దర్శించు కున్నారు. వీరఘట్టం మం డలం కత్తులకవిటికి చెంది న ఆయన అమ్మవారిని దర్శించుకోవ డానికి రావడంతో ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాదశర్మ, వేమకోటి మణీల్‌శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాం గణంలో దుశ్శాలువతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో అర్చకులు మణీల్‌శర్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:48 PM