Share News

పనుల్లో జాప్యం సహించేది లేదు

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:46 AM

జిల్లాలోని తాగునీరు, పారిశుధ్యం పనుల్లో జాప్యం సహించేది లేదని, పెండింగ్‌ పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు.

పనుల్లో జాప్యం సహించేది లేదు

  • ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతాం

  • కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం, కలెక్టరేట్‌, సెప్టెంబరు 24(ఆం ధ్రజ్యోతి) జిల్లాలోని తాగునీరు, పారిశుధ్యం పనుల్లో జాప్యం సహించేది లేదని, పెండింగ్‌ పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన జిల్లా నీరు, పారిశుధ్య మిషన్‌ ఆధ్వర్యంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ పథకాల పురోగతిపై సంబంధిత అధికారులతో వీడి యో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలోని తాగునీరు, పారిశుధ్యం పనులన్నీ కాంట్రాక్టర్లతో మాట్లాడి, ఈ వారంలోగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నా రు. పనులన్నీ డిసెంబరులోగా పూర్తయ్యేలా కార్యచర ణ తయారు చేయాలన్నారు. పనులు ప్రారంభించకుం డా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సుమారు రూ.6 కోట్ల మేర పెండింగ్‌ బిల్లులు ఉన్నప్పటికీ పనులు నిలిపివేయడం సరికా దని, తక్షణమే పనులు ప్రారం భించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతామని ఆయన హెచ్చరించారు. జిల్లాలోని రూ.479.63 కోట్ల అంచనా వ్యయంతో 711 రద్దు చేసిన సింగిల్‌ విలేజ్‌ స్కీమ్‌ పనులను పునరుద్ధరించినట్టు అధికారులు.. కలెక్టర్‌కు వివరించారు. ఈ పనులన్నీ 2028 డిసెంబరు నాటికి పూర్తి చేయడం ద్వారా 1,329 ఆవాసాలకు తాగునీరు సదుపాయం కల్పించనున్నామని తెలిపారు. సీపీడ బ్ల్యూఎస్‌ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో 30 సీపీడబ్ల్యూఎస్‌ పథకాల ద్వారా 872 ఆవాసాలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చూడాలన్నారు. 2026-27 సం వత్సరానికి రూ.3,917.52 లక్షల వ్యయం తో ప్రతిపాదించిన నిర్వహణ, మరమ్మ తులకు ఆమోదం లభించే వరకూ ప్రస్తుతం ఉన్న ఏజెన్సీల ద్వారానే నీటి సరఫరా వ్యవ స్థల నిర్వహణ సజావుగా కొనసాగించాలని ఆదేశించారు. ప్రసు త్తం వర్షాకాలంలో తాగునీటి వనరులు కలు షితమయ్యే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్ట ర్‌ సూచించారు. స్వచ్ఛభారత మిషన్‌ కింద పాఠశాల లు, గ్రామ సచివాలయాలు, ఇతర ప్రజా ప్రదేశాల్లో మంజూరైన 204 సామూహిక మరుగు దొడ్డి పనుల్లో, పురోగతిలో ఉన్న 77 పనులను త్వరగ తిని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ తాగునీటి విభాగం ఎస్‌ఈ కవిత, డీపీవో మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:46 AM