Share News

Paddy Remains Stuck నూర్పుడిలో ఆలస్యం.. కదలని ధాన్యం

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:01 AM

Delay in Procurement… Paddy Remains Stuck జిల్లాలో పలు ప్రాంతాల్లో నూర్పులు ఆలస్యం కావడంతో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అవి కల్లాలోనే దర్శన మిస్తున్నాయి. కొనుగోలులో సాంకేతిక సమస్యలున్నట్లు అధికారులు చెబుతుండడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.

  Paddy Remains Stuck నూర్పుడిలో ఆలస్యం..  కదలని ధాన్యం
పాలకొండ మండలం పారాపురంలో ధాన్యం బస్తాలు ఇలా..

  • సాంకేతిక సమస్యలున్నట్లు అధికారుల వెల్లడి

  • తలలు పట్టుకుంటున్న రైతులు

పాలకొండ, మార్చి4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు ప్రాంతాల్లో నూర్పులు ఆలస్యం కావడంతో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అవి కల్లాలోనే దర్శన మిస్తున్నాయి. కొనుగోలులో సాంకేతిక సమస్యలున్నట్లు అధికారులు చెబుతుండడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవంగా ఖరీఫ్‌ వరి పంట చివరి దశలో ఉన్నప్పుడు.. కోతలు కోసి కుప్పలేశారు. అదే సమయంలో రబీ కింద మినుము, పెసర, ఇతర వాణిజ్య పంటలను వేశారు. మినుము, పెసర, కట్టి జనుము ఇతర పంటలు ఇప్పుడిప్పుడే నూర్పిడికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ధాన్యం నూర్చి బస్తాల్లో నిల్వ చేస్తున్నారు. కాగా వాటిని రైస్‌ మిల్లర్లు తీసుకోవడం దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మెట్రిక్‌ టన్నుల వరకు ఇలా ఖరీఫ్‌ ధాన్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి తదితర మండలాల్లో పంట పొలాల్లోనే ధాన్యం నిల్వలు దర్శన మిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధి కారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీనివాసరావుని వివరణ కోరగా.. ‘సాంకేతిక సమస్యలతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొద్ది రోజుల్లోనే ఆ సమస్యలను అధిగమిస్తాం. జిల్లాలో రైతుల నుంచి మరో పది వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపడతాం.’ అని తెలిపారు.

Updated Date - Mar 05 , 2026 | 12:01 AM