deep investigation మరింత లోతుగా..
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:11 AM
deep investigation విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగు విభాగంలో ఏసీబీ అధికారులు రెండో రోజు బుధవారం తనిఖీలను కొనసాగించారు. మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 11.30 గంటల వరకూ అన్ని ఫైళ్లను పరిశీలించారు. రెండో రోజు ఉదయం 9 గంటలకు తనిఖీలు తిరిగి ప్రారంభించారు. ఈసారి నగరపాలక సంస్థ కార్యాలయంలోనే కాక ఆ ఫైళ్లకు సంబంధించి అందిన ఫిర్యాదులపై దృష్టి పెట్టారు. అయ్యన్నపేట, కామాక్షినగర్‌కు ఏసీబీ అధికారులు వెళ్లి ప్లాన్ అనుమతులు ఇచ్చిన భవనాలను పరిశీలించారు.
మరింత లోతుగా..
నగరపాలక సంస్థ కార్యాలయంలో రెండో రోజు కొనసాగిన ఏసీబీ తనిఖీలు
క్షేత్రస్థాయిలో పలు భవనాలూ పరిశీలన
లైసెన్సు సర్వేయర్లను విచారించిన డీఎస్పీ రమ్య
విజయనగరం క్రైం, మార్చి11(ఆంధ్రజ్యోతి): విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగు విభాగంలో ఏసీబీ అధికారులు రెండో రోజు బుధవారం తనిఖీలను కొనసాగించారు. మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 11.30 గంటల వరకూ అన్ని ఫైళ్లను పరిశీలించారు. రెండో రోజు ఉదయం 9 గంటలకు తనిఖీలు తిరిగి ప్రారంభించారు. ఈసారి నగరపాలక సంస్థ కార్యాలయంలోనే కాక ఆ ఫైళ్లకు సంబంధించి అందిన ఫిర్యాదులపై దృష్టి పెట్టారు. అయ్యన్నపేట, కామాక్షినగర్‌కు ఏసీబీ అధికారులు వెళ్లి ప్లాన్ అనుమతులు ఇచ్చిన భవనాలను పరిశీలించారు. ఆ భవనాల యాజమానులను, అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా ప్రశ్నించారు. ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో సీఐ మహేష్ సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగు ఏసీపీలు, టీపీఓలు, టీపీఎస్‌లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ప్లానింగు సెక్రటరీలు, కార్యాలయ సిబ్బంది, టౌన్ సర్వేయర్‌లను బుధవారం కూడా అందుబాటులోకి తీసుకున్నారు. భవన నిర్మాణ అనుమతులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రతి ఫైలును అనువణువునా పరిశీలిస్తున్నారు. ప్లాన్ గీసిన లైసెన్సు సర్వేయర్లలో కొంత మందిని పిలిపించి విచారించారు.
----------------