Share News

Decrease of 1,27,877 voters 1,27, 877 మంది ఓటర్ల తగ్గుదల

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:40 AM

Decrease of 1,27,877 voters v ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్‌ శుక్రవారం విడుదల చేసింది. ఇదే రోజు జిల్లా కేంద్రం నుంచి అధికారులు మండలాలకు జాబితాను పంపారు.

Decrease of 1,27,877 voters 1,27, 877 మంది ఓటర్ల తగ్గుదల
ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న సిబ్బంది

1,27, 877 మంది ఓటర్ల తగ్గుదల

జిల్లా వ్యాప్తంగా 14,51,072 ఓటర్లతో జాబితా

ముసాయిదా విడుదల

రాజాం, చీపురుపల్లిలో మహిళా ఓటర్లు తక్కువ

ఆగస్టు 30 వరకూ అభ్యంతరాల స్వీకరణ

అక్టోబరు 3న తుది జాబితా విడుదల

విజయనగరం కలెక్టరేట్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్‌ శుక్రవారం విడుదల చేసింది. ఇదే రోజు జిల్లా కేంద్రం నుంచి అధికారులు మండలాలకు జాబితాను పంపారు. గత జాబితాను ఇప్పటితో పోల్చి చూస్తే జిల్లా వ్యాప్తంగా 1,27,877 మంది ఓటర్లు తగ్గారు. దీనిపై ఆగస్టు 30 వరకూ అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబరు 28 వరకూ వాటికి పరిష్కారం చూపుతారు. అనంతరం తుది ఓటర్ల జాబితా ఆక్టోబరు 3న విడుదల చేస్తారు.

తాజాగా విడుదలైన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 14.51,072 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 7,16,493 మంది, మహిళలు 7,34,518 మంది, ఇతరులు 61 మంది ఉన్నారు. ఏడు నియోజకవర్గాల్లో సర్వీసు ఓటర్లు 5591 మంది ఉన్నారు. రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు తక్కువగా ఉన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు ముందు జిల్లాలో మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 14,51,072 మంది వివరాలు ఎన్యూమరేషన్‌ ఫారాలను డిజిటలైజేషన్‌ చేశారు. తగ్గిన 1,27,877 మందిలో 55,958 మంది మరణించారు. 36,185 మంది శాశ్వతంగా బదిలీపై వెళ్లారు. మరో చోట నమోదు చేసుకున్నవారు 18,217 మంది ఉన్నారు. గైర్హాజరైన వారు 17,425 మంది, ఇతరులు 92 మంది ఉన్నారు.

నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు

-----------------------------------------------------------------------------------------

పేరు పురుషులు మహిళలు థర్డ్‌జెండర్‌ మొత్తం ఓటర్లు

------------------------------------------------------------------------------------------

రాజాం 1,04,258 1,01,923 11 2,06,192

బొబ్బిలి 1,05,220 1,07,116 11 2,12,347

చీపురుపల్లి 94,655 93,748 8 1,88,411

గజపతినగరం 94,299 97,187 2 1,91,488

నెల్లిమర్ల 99,513 1,01,730 4 2,01,247

విజయనగరం 1,17,731 1,26,371 22 2,44,124

ఎస్‌.కోట 1,00,817 1,06,443 3 2,07,263

-----------------------------------------------------------------------------------------------------------

మొత్తం 7,16,817 7,34,518 61 14,51,072

-----------------------------------------------------------------------------------------------------------

అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలి

ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే బీఎల్‌వో లేదా తహసీల్దార్‌ లేదా ఎన్నికల అధికారికి వివరాలు అందజేయాలి. జాబితాలో పేరు, చిరునామ, ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే శుక్రవారం నుంచి ఆగస్టు 30 వరకూ అధికారులకు వివరాలతో దరఖాస్తు చేయాలి.

18 సంవత్సరాలు నిండిన కొత్త వారంతా ఫారం -6, ఎనగ్జర్‌ డి సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలి. సర్‌ ప్రక్రియలో వివరాలు సమర్పించిన వారు లేదా వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నవారికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసు అందుకున్నవారు గడువులోగా అవసరమైన ధ్రువపత్రాలను ఏఈఆర్‌వో, ఈఆర్‌వోకి అందజేయాలి.

Updated Date - Aug 01 , 2026 | 12:40 AM